బ్రతుకుబాట ..!! >నాలో మార్పులు.కోరాడ నరసింహరావు > విశాఖపట్నం

  --------------   19   --------------
   ఏ స్థితిని కోరుకుని...యోగులు
సుదీర్ఘ సాధన చేస్తారో... ఆ స్థితిని  ఆదైవం ఎవరికి... ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తాడో ఎవరూ చెప్పలేరు !
అటువంటి స్థితిని నేనో అనూ హ్యమైన రీతిలో పొందాను .
అప్పుడప్పుడూ వెళుతున్నట్టే 
ఆరోజు కూడా... . నేను, నా అసిస్టెంట్ రవి ఇంకా ఒకరిద్దరు మిత్రులూ కలిసి కొత్తపట్నం వెళ్లాం ! అక్కడి రాజకుటుం భీకులు  మదనకామేశ్వరాన్ని 
( భంగు ముక్కలను ) మాదకత తోపాటు,శృంగారంలో 
సామర్ధ్యం కోసం వాడతారట !
మేముమాత్రం... దానిలోని గమ్మత్తైన మజా కోసమే తినేవాళ్ళం ! అదో విచిత్రమైన అనుభూతి... ! తీపిగాని- కారంగాని ఏదితిన్నా ఇంకా - ఇంకా తినాలనే అనిపిస్తుం
టుoది... ! ఆ క్షణం చుట్టూ ఉన్నదంతా స్పృహలోనే ఉంటుంది... మరుక్షణం... 
పూర్తిగా మైకం కమ్మేస్తుంది 
అలాగని తూగటం, జోగటం, 
పడిపోటం లాంటివేవీ ఉండేవికావు !నవ్వొచ్చేది... ఇంక ఆగేది కాదు అలా ఆరోజంతా పిచ్చోడిలా నవ్వటమే !ప్రతిసారీ అలాంటి  స్థితి ఒక్కరోజే ఉండేది, గాని... 
ఈ మారు మూడురోజులు 
వదల్లేదు...!ఆ స్థితిలోనే 
నాకొక అద్భుతం జరిగిoది .
దీనికోసమే యోగులు నిరంతర క్రియాయోగ సాధనతో... పంచ ప్రాణాలనూ ఏకం చేసి మూలా
దారంలోముడుచుకుని ఉన్న 
కుండలిని  మేల్కొల్పి... ఐదు  క్రాలనూ దాటించి ఆజ్ఞాచక్రమున్న భృకుటి మధ్యకు తీసుకు వచ్చి.. సహస్రారంలో కలిపే ప్రయత్నం చేస్తారో... ఆ గొప్పస్థితి.. నాకామత్తులో కలిగింది... !అక్కడినుండి ఆ శక్తిని సహస్రారంలో కలపగలిగిగితే.. 
అదే ముక్తి...!త్రికూటంలో ఆజ్ఞా
చక్రమువద్దకు నాలో... ఇడా నుండి వచ్చిచేరింది... అలాగే పింగళ నుండీ వచ్చి చేరాలి అదే త్రివేణీ సంగమం... !
అయ్యో కేవలం ఇడా  నుండే  
వచ్చి చేరిందే... పింగళానుండి రాలేదే అని నేనామత్తులోనే అనుకుంటూ అదీ వచ్చి చేరితే బాగుణ్ణు అని అనుకుంటు న్నంత లోనే... పింగళానుండి కూడా వచ్చి చేరిపోయింది... 
ఇంక నా ఆనందానికి అవధులు లేవు... !
అక్కడినుండి నా జీవన విధానంలో మార్పులు... రోజు -
రోజుకూ మారిపోసాగాయి !!
                   ***************
                  -------  సశేషం -------

కామెంట్‌లు