పెళ్ళిసందడి;-ఎం. ఎ ఉమారాణి--కలంస్నేహం
పెళ్ళిపత్రికలు బంగారురేకులతో చేయించిరి
వజ్రాలను మణులను రత్నాలను పొదిగిరి
 వెండిరథములో వెళ్ళి ఆహ్వానించిరి
అందరికి సువర్ణ కంకణములు బహుకరించిరి

ఆకాశమంత పందిరి వేయించారు
భూదేవంత మండపమేసారు
బంధువులందరు ప్రవాహమువలె వచ్చినారు 
ధగధగ మెరిసే పట్టుపీతాంబరములు ధరించారు
 మహిళామణులు చుక్కల్లా మెరుస్తున్నారు

మహిళలు అప్సరసలను తలపోస్తున్నారు
స్వర్గమే ఇలకు వచ్చిందనుకుంటున్నారు
సందడివిని సముద్రపుహోరనుకుంటున్నారు
గలగలశబ్దాలు సెలయేరులనుకుంటున్నారు

వంటలు నలభీమపాకమా అన్నట్లున్నవి 
సువాసనాభరితాలై ఘుమఘుమలాడుచున్నవి
రకరకాలపాయసాలు చంద్రునివెన్నెల
పాత్రలో చేరినట్లున్నవి
వండిన కూరగాయలు అందంగాపూసిన
పూలతోటలాఉన్నవి.


కామెంట్‌లు