బ్రతుకు బాటలో... జీవన గమ్యానికి... ఎన్నెన్ని మైలు రాళ్ళుదాటాలో... ఎక్కడెక్కడ ఎలాంటి మజిలీలు చేయాలో కదా...!కోరాడనరసింహా రావు.

 బ్రతుకు బాట 
    ***  36  ****
******
 పెద్దచెల్లి, బావ ముగ్గురు బాబు లతో కంచర పాలెం లోని అద్దె ఇంటినుండి... మర్రిపాలెంలో కొనుక్కున్న సొంత ఇంటికి.. !
రెండో చెల్లి.. దారి తప్పిన భర్తను ఓర్పు, సహనాలతో... 
దారిలో పెట్టి... ఆ సాలూరు లోనే ఉంటే... బాగుపడమని బ్రతుకుతెరువును వెతుక్కుం టూ... వైజాగ్ వెళ్లిపోవటం !
ఇంక మూడో చెల్లికి కాబోయే అత్త... పెళ్లి విషయంలో పేచీ లు పెట్టినా... పెళ్ళికొడుకు మంచివాడు కావటంతో... 
మా చిన్నిందీ మాష్టారి మధ్యవర్తిత్వం తో పెళ్లి జరిగేనా 
తగవులతో... చిన్న చెల్లి, బావ ఇద్దరు మొగపిల్లలతో వేరే కాపురం పెట్టుకోవటం... అన్నీ  అలా - అలా జరిగిపోయాయి!
ఆర్ధిక లేమి ఎన్ని ఇబ్బందులకు గురిచేస్తుందో అనుభవమున్న 
వాడిని కనుక... ముగ్గురు ఆడపిల్లల చదువులు, పెళ్లిళ్లు దృష్టిలో
 పెట్టుకుని... వచ్చిన ఆదాయంలో వీలైనంత... బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పొదుపుచెయ్యటం మొదలు పెట్టాను !
ఈలోగా...మిత్రుడు ధర్మరాజు 
కు పెళ్లి సంబంధం కుదిరింది... 
అత్తవారు స్థితిపరులు...  వాళ్ళిచ్చిన కట్నం డబ్బు తన వాటా పెట్టుబడిగా ఇస్తాను... 
తనకు స్టూడియో లో వాటా ఇమ్మన్నాడు !ఎలాగూ నా ఆర్ధిక పరిస్థితి కాస్త మెరుగు పడింది కనుక నేను మితృడికి 
వాటా ఇవ్వటానికి సిద్ధపడేసరికి ఇంట్లో అమ్మ, తమ్ముడు పేచీ పెట్టారు !
ఎవడో పయోడ్ని గురించి ఆలోచిస్తున్నావు, సొంత తమ్ముడ్ని పట్టించుకోవా అని నిలదీసే సరికి... అందరినీ సంతృప్తి పరిచే విధంగా... 
తమ్మడినీ, మిత్రుడినీ ఇద్దరినీ భాగస్వాములను చేసుకోవాలని నిర్ణయించి కున్నాను ! ఈ లోగా షాప్ ఓనర్.. అద్దె కాదు... 25 వేలు ఇస్తే భోగభoదాకి
బంధా కైతేనే షాపు ఇస్తాననటం తో.... నేనో నిర్ణయానికొచ్చాను, అదేమంటే 
షాపులోని కెమేరా, సామాను మొత్తం నావే వాటికి మీరెవరూ ఎటువంటి డబ్బూ.. వాటాగా ఇవ్వనక్కరలేదు !
వచ్చిన ఆదాయం లో... అరవై నాది... యాభై మితృడిది... 
నలభై తమ్ముడిది... !
షాప్ భోగబoదాకై ఇస్తున్న 25 వేల లో కేవలం మిత్రుడు ఎనిమిదివేలిస్తే... మేం 17 వేలు ఇచ్చి... డీల్ కేన్సిల్ అయిన తరువాత...ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకోటానికి, అందరం 
అంగీకరించడంతో... ఒకే ఆదాయం మూడు వాటాలుగా 
మారిపోయింది స్టూడియో !
      ******
   .....   సశేషం .......
కామెంట్‌లు