బాలలూ మీకు తెలుసా....
పేదరికపు పరదాలను
పక్కకు నెట్టి విజ్ఞాన
పీఠాన్ని అధిరోహించిన
పట్టాభి రాముడతడు.....
అంటరానితనం
అస్పృశ్యత ల
అహాలను అణచివేసిన
అభినవ మాణిక్య మతడు.....
స్యయంకృషి
స్వీయప్రతిభల
స్వతంత్ర భారత దేశ
సమగ్ర కార్య రూపశిల్పి అతడు....
భారత రాజ్యాంగానికి
బహుచక్కని రూపమిచ్చిన
భీంరావ్ రాంజీ అంబేద్కర్ అతడు.....
అవమానాలు అసమానతల
అడుగు జాడలను చెరిపేస్తూ
భహిస్కృతి భారతి మనుస్కృతి మరాఠీ
పత్రికలను నడిపిన ధీరుడతడు....
భారతీయులందరూ మెచ్చిన
బాబా సాహెబ్ అంబేద్కర్ అతడు
భారత రత్న మతడు....!!
( భీంరావ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి