అరచేతిలో ప్రియురాలు;-విష్ణు ప్రియ;-కలంస్నేహం
బంధాలను....
అనుబంధాలను....
మమకారపు మాధుర్యాలను మూటగట్టి....
చీకటి గదిలో ఓ మూలన విసిరేసి....

మన అరచేతిలోకి చేరింది చరవాణి...
మాయలెన్నో చేసి,మంత్రమేదో వేసి....
అద్భుతాలను చూపించి...
కనికట్టు చేసింది కథలెన్నోచెప్పింది...
కడకు మనుషుల మధ్య దూరాలను పెంచింది
తాను మాత్రం ఎవ్వరినీ వదలని వ్యసనమై మిగిలింది..

ఆనందాలను ఆవిరిచేసింది... ఆత్మీయతను ఆస్వాదించలేని స్థితికి మనిషిని దిగజార్చి...
తాను మాత్రం మన చేయి వీడని ప్రియురాలై నిలిచింది....

కుటుంబ బంధాలను విరిచేసి..
నెట్టింటి అనుబంధాలకు నెలవై....
మనిషికన్న తానే మిన్నగా మారింది...
చరవాణి చేతిలో చిక్కి చేయకు జీవితాన్ని చిందరవందర...
ఓ...మానవా...
నీ విజ్ఞానంతో రూపొందించిన చరవాణిని ఒక వస్తువుగా వాడుకో...
నీవే దానికి బానిసగా మారకు...
బ్రతుకులోని తీయదనం
ఆస్వాదించు...
ప్రేమ విలువ తెలుసుకో...
జీవితాన్ని సార్థకం చేసుకో....


కామెంట్‌లు