ఊరించే టమాట; -కళావతి కందగట్లహైదరాబాద్
కంటికి ఇంపైన రంగు
ఒంటికి మేలైన వంటకం 
నోరు ఊరించే టమాట...
నేటి ....రేటు వింటే
రాదు నోటమాట...

కూరగాయల్లో మేటి యైనది
చూడగానే తినాలనిపించేది 
రోజు తిన్నా  విసుగనిపించనిది
టమాటయే కదా..!

 ఏమున్నా లేకున్నా
 కాసిన్ని ఇంట్లో ఉంటే చాలు
 టమాటాలు...
 చేయొచ్చు ఎన్నో రకాల
 కూరలు....

రసానికి ఉంటే చాలు
రెండు పండు టమాటాలు
పచ్చడికి చాలు
పచ్చి టమాటాలు అయినా...

 గ్రేవీకి చిక్కదనం 
 అర మగ్గిన టమాటా లే కదా
 కూరలకు అదనపు రుచి
 కూసిన్ని టమాటలే కదా

 టమాటాలు లేని
 సాంబారు కలదా...
 టమాటాలు లేక
 పులుసు కూరలకు
 పులుపు కలదా ....

ధర ఎక్కువైనను
మక్కువ తగ్గునా
మహి లోన జనులకు...కామెంట్‌లు