గర్వభంగం;-పి.నరేష్.నేరళ్లపల్లిజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలానగర్(మం)మహాబుబ్ నగర్(జిల్లా)

 ఒక అడవిలో ఎన్నో రకాల జంతువులు నివసిస్తున్నాయి.
ఆ అడవిలో జంతువులు ఇష్టమైన   ప్రదేశాన్నిఎంచుకొని  అక్కడ  కంచె వేసుకొని   పంటలు పండించడం చేసేవి.
అలా అన్ని  జంతువులు  కష్టపడి వాటి ఆహారాన్ని పండించుకుంటూ సంతోషంగా ఉండేవి.
అక్కడికి ఎక్కడనుండో ఒక గర్విష్టి  ఏనుగు వచ్చింది.దానికి అహంకారం  ఎక్కువ.
'నన్ను ఎవ్వరూ ఏంచేయలేరు.
నేను అన్ని జంతువులు కంటే పెద్దదాన్ని . బలవంతుడను'  అని అహంకారం  తో ఉండేది.
కంచెను లాగేసి,తనకు అవసరమైన  ఆహారం తినేది.ఏపనీ చేసేది కాదు.
పంట మొత్తం నాశనం  చేస్తూ ఉండేది.
జంతువులకు ఏనుగు ప్రవర్తన పెద్ద  సమస్య అయింది.  జంతువులు ఒక చోట చేరి   ఏనుగుకు బుద్ధి చెప్పాలని 
ఉపాయం అలోచించసాగాయి.
అప్పుడు కోతికి ఒక ఉపాయం తట్టింది.  అన్ని జంతువులకూ చెప్పింది.   కోతి,కుందేలు కలిసి ఏనుగు ఉన్న ప్రదేశానికి  వెళ్లి కొంతదూరంలో నిలబడి గట్టిగా మాట్లాడుకోసాగాయి.
కోతి,కుందేలుతో "మిత్రమా!  మనం పండించిన  చెరుకు పంటను  మనం నివసిస్తున్న ప్రదేశానికి దూరంగా ఉన్న ముళ్లపొదలో దాచాను" అని ఏనుగు కు వినపడేలా గట్టిగా అంది.
తర్వాత కొద్దిసేపు మాట్లాడుకొని అక్కడి నుండి వెళ్లిపోయాయి. అప్పుడు 
ఏనుగు గబగబా నడుచుకుంటూ  ముళ్లపొద వద్దకు వెళ్లింది.
ముళ్లపొదలను పట్టించుకోకుండా లోపలికి దూసుకెళ్లింది.ముళ్లపొద లోపల  ఇరుక్కున్నాది. అక్కడ ఉన్న తేనెటీగలు ఏనుగుపై దాడిచేసి కుట్టసాగాయి.
ఏనుగు "నన్ను  రక్షించండి."అని అరవసాగింది.బలమంతా ప్రయోగించి ఒళ్లంతా ముళ్లతో పొదనుండి బయట కొచ్చింది.తేనెటీగలు ఏనుగును వదలక వెంటపడ్డాయి.ఏనుగు పరుగులుపెడుతూ ఆ అడవిని వదిలి వెళ్లిపోయింది. జంతువులు సంతోషించాయి.
ఏనుగు తన తప్పులను తెలుసుకొని, 
'నేను పెద్దదాన్ని,బలవంతుడను అని గర్వపడరాదు. ఎవ్వరినీ  కష్టపెట్టకూడదు
ఎవరి సామర్థ్యం వాళ్ళకు ఉంటాయి.' అనుకుని, తన పాత అడవికి చేరుకుని మంచి ప్రవర్తనతో జీవించింది. 

కామెంట్‌లు