ఘంటసాల;--యడ్ల శ్రీనివాస రావు విజయనగరం జిల్లా
సరస్వతీ పుత్రుడు
సినీ కళామతల్లి బిడ్డ 
విజయనగరం కీర్తిని వెలిగించిన బావుటా
 సుస్వరాల సుమ గీతికలు
 సరస్వతి కంఠం పై విరిసిన కీర్తి 
మధురమైన స్వరం
చిరంజీవులు అతడు
తెలుగు బిడ్డడు ముమ్మాటికి
సరస్వతి మాత ఒడిలో ఒలలాడిన  వజ్ర మకుటం
మకుటం లేని మహారాజు 
సినిమా రంగంలో
నాడు నేడు ఏనాడు వన్నె తరగని కంఠం
నవరసాల   ఘంటసాల
 సంగీత ఓ నా మాల
సంగీత సాహిత్యపు సుస్వరాల
తెలుగు మందిరంలో   వెలసిన గంధర్వుడు ఘంటసాల 
 గురజాడ జాడ ఈయన పాట ముత్యాల పల్లకి
విలువైన పదజాలం
బరువైన కీర్తి
భగవద్గీతను పలికిన విధాత
ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గొంతులు వినసొంపుగా పాడినా గంధర్వుడు
సరస్వతీ పుత్రుడు కావున
ఈయన గతించిన
 పాటలు చిరస్మరణీయంగా గుర్తుకు తెచ్చాయి
విజయనగరం నివాసి జై హో
అమర గాన గంధర్వుడు నీకే వందనం
మరువము నిన్ను తలుచుకుంటూ ఉన్నాము


...............................

కామెంట్‌లు