అత్యవసర చికిత్స ...!!- ప్రసాద్ కె ఎల్వీ . హన్మకొండ
 నువ్వు రాసిందే 
కరెక్టు అనుకుంటే ,
నువ్వు మాట్లాడిందే 
నిజం అనుకుంటే ...
నువ్వుపొగిడినవాడే 
గొప్పవాడనుకుంటే ,
నువ్వు చేసిన విమర్శే 
సరైన విమర్శ అనుకుంటే ,
నువ్వు ముద్ర వేసినవాడే 
అసలైన నాయకుడంటే ,
నీలో ఎక్కడో ....
అనారోగ్యం చీడ 
గూడుకట్టుకుని ఉన్నట్టే !
ఈ అంటురోగం 
నలుగురికి అంటకుముందే 
నీకు ఎమర్జెన్సీ చికిత్స 
అత్యవసరం ......!!
                 ***

కామెంట్‌లు