జ్ఞాన జ్యోతి ....!!>శ్రీమతి అఫ్సర వలిషా> ద్వారపూడి
పద్నాలుగోవ సంతానం
పద్నాలుగోవ తేదీన
పదుగురు మెచ్చిన పేదింటి
జ్ఞాన జ్యోతి  పీఠమడతడు.....

అంటరానితనాన్ని 
అస్పృశ్యతను
ఆమడదూరం 
అణచిన అణుశక్తి అతడు....

దళితుడైనా జాతిని
జాగృత పరచిన 
జనం మెచ్చిన 
జన నాయకుడతడు....

భారత రాజ్యాంగ 
బరువు భాద్యతలను
బలోపేతం చేసిన 
భారత రత్నమతడు....

పిన్న వయసులో 
డాక్టరేట్ సంపాదించి
అగ్రవర్ణాణ్ణి అతలాకుతలం
చేసిన విజ్ఞాన పరిమళాన్ని 
వెదజల్లిన  కుసుమ మతడు.....

మనుస్మృతి 
బహిస్కృతి భారతి 
పత్రికలతో ప్రజలను
ఉత్తేజ పరిచే చైతన్య రూపుడతడు.... 

మహా మేధావి 
సంఘసంస్కర్త
ప్రజాస్వామ్య 
పరిరక్షకుడతడు....!!

(జ్ఞాన జ్యోతి బాబా సాహెబ్
అంబేద్కర్  వర్ధంతి సందర్భంగా నివాళి 💐🙏💐🙏💐 ) 


కామెంట్‌లు