తాతా మనవడు (కథ)( "రాజశ్రీ" కవితా ప్రక్రియలో)(రెండవ భాగం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 5)
సిగ్గు బుధ్ధి నీకులేవ
పసి వాడిని నడిపింతువ
అది విన్న తాతపుడు
మనుమని కూర్చుండ బెట్టినాడు!
6)
కొంత దవ్వు నేగినారు
లోకులు వీరిని చూచినారు
ఏమిటిది ఏమిటిది ఎంతరోతో
మనుమని తిట్టిరి కోపముతో!
7)
సిగ్గు బుధ్ధి నీకులేవ
ముసలి వాని నడిపింతువ
లోకులమాట వారు వినిరి
గాడిదపై ఇద్దరూ కూర్చుండిరి!
8)
కొంత దూరము పోయినాక
లోకులు వారిని చూచినాక
కనము వినము ఎపుడుమనము
పరమ దుష్ట కార్యము!
(సశేషము)

కామెంట్‌లు