పుస్తకం! అచ్యుతుని రాజ్యశ్రీ

 పుస్తకం పుస్తకం!కథలుకబుర్లు చెప్పు! అణువునుంచి అంతరిక్షందాకా!
రంగుల బొమ్మలు  కువకువ పిట్టలు రకరకాల చెట్లు!
గలగలపారే నదులు పొలాలు నీరు నిప్పు మనిషిని గూర్చి చెప్పు!
దేశ నాయకులు కవులు కళాకారులు  రాజురైతు సిపాయి !రిక్షా మొదలు రాకెట్ దాకా కథలుచెప్పు!
సామెతలు పొడుపుకథల గుట్టు విప్పు!
నీతులు సుద్దులు బుద్ధులు
విజ్ఞాన వినోదం వేదాంత సారం
నిశబ్దం గా మన చేతిలో ఇమిడి ఆలోచనలు గిలకొట్టు!
శ్రద్ధగా చదివి వ్రాసి ఎక్కించాలి
మస్తకంలోకి !
పుష్ప గుచ్ఛాలు వద్దు!
పుస్తకాల బహుమతి ముద్దు!
అక్షరాలను బీజాక్షరాలుగా మార్చి తెలుగు వెలుగు పరుచుకోవాలి!
విశ్వవిజేతగా నిలవాలి🌹
కామెంట్‌లు