సిరివెన్నెలకు నివాళి;- -కంచనపల్లి ద్వారకనాథ్Mob. No: 9985295605

 సిరివెన్నెల  చీకటిలోకి  వెళ్ళిపోయింది
పాటల  కలం  మూగబోయింది
నవరసాలు  అక్షరాలలో  రంగరించి 
సప్తస్వరాలు  పలికించి 
మధురంగా  మురిపించి,  మైమరపించిన 
కలం  కన్నీళ్లు  మిగిల్చి  వెళ్ళిపోయింది
కొత్త  పదాలతో  సాహితి లోకానికి కొత్త ఒరవడి నేర్పిన శాస్త్రి 
ఎందరో  రచయితలకు  స్ఫూర్తి 
అతనిలోని  భావ  స్పందనలు 
సముద్ర గర్భంలో  దాగిన  సిరి  సంపదలు
వేల  పాటలను  రచించి
 ప్రేక్షకులనందరిని  అలరించిన  ఘనుడు 
ఏకాకిగా  ఈ లోకం  విడిచి  వెళ్ళిపోయినా
జగమంత  కుటుంబం  స్మరిస్తూనే  ఉంటుంది
అతని  కీర్తి ఈ  సినీ లోకంలో 
పాటల  పతాకమై  నింగిలో   ఎగురుతూనే  ఉంటుంది
 
(సిరి వెన్నెల సీత రామయ్య శాస్త్రి మరణ వార్త విని స్పందించి రాసిన గేయం)
 
 
                                                            

కామెంట్‌లు