*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౬౭ - 067)
 కందం:
*వేములఁ దినునలవాటును*
*భామలగని వీడుటయును బరితోషమునన్*
*బాములమైత్రియు నేర్చినఁ*
*గోమటితో మైత్రి వలయు గువ్వలచెన్నా!*
తా.: ..  
వేప ఆకులను తినే అలవాటు వున్న వాడునూ, స్త్రీలను చూచి కూడా వారి వెంట పడక పక్కకు జరిగి పోవు వాడునూ, పాముల వంటి లక్షణములు కలిగిన మనుషలతో స్నేహము చేయగలవాడునూ అయిన వైశ్యునితో, కోమటితో స్నేహముగా వుండుట మంచిది .....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*"వైశ్యునికి జన్మతః డబ్బు తో డబ్బు సంపాదించాలి అనే లక్షణం వున్నా, డబ్బు సంపాదించే ఆ పై డబ్బు కోసమైనా పక్కవానికి సహాయ పడే గుణం వుంటుంది.  అందుకే, మన పెద్దలు అనేవారు " మన ఇంటి ఇరుగు పొరుగుగా వైశ్యడు వుంటే, మంచి జరుగుతుంది" అని.*
*ఆవిధంగా, తమ తోటి వారికి సహాయపడాలి అనే లక్షణం వున్న ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, సమాజానికి అవసరమే. ఒకరికి తోడ్పాటును అందించాలి అనే ఆలోచన రావడం కూడా మంచి విషయమే.  "ఒకరికి, ఒకరు. ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు" అలా "మనమందరం" అనే భావన మన చుట్టూ మనం పెంపు చేయవలసిన అవసరం ఈ రోజు సమాజంలో ఎంతైనా వుంది. నేను, నాది అనే స్వార్ధ పూరిత వాతావరణం నుండి, మేము, మాది అనుకునే మంచి లక్షణాలను మన చుట్టూ వున్న అందరికీ అబ్బేలా చేయమని, అలా చేయగల వాడైన సర్వేశ్వరుని వేడుకుంటూ......*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు