*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౭౨ - 072)
 కందం:
*ఎంతధికారంబున్నను* 
*సంతతమును బరులయెడల సత్కులజాతుం*
*డెంతయు నమ్రతఁ జూపును*
*గొంతైనను మిడిసిపడఁడు గువ్వలచెన్నా!*
తా.: ..  
 మంచి లక్షణాలు, కలిగిన మనిషి ఎంత గొప్ప అధికారము తనకు దక్కనా, ఏమాత్రమూ గర్వాన్న చూపించడు.  అవతల వారితో ఎంతో నమ్రత గా వుంటాడు అసలు ఎగిరెగిరి పడడు......అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*"అన్ని వున్న విస్తరి అణిగి మణిగి వుంటుంది" ఈ నానుడి మనం మన చిన్నప్పటి నుంచి వింటున్నాము.  ఒక అబ్దుల్ కలామ్ ఆజాద్, ఒక చాగంటి వేంకటేశ్వర రావు, ఒక గరికపాటి, సద్గురు శివానంద, పరమాచార్య ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది మన చుట్టూ కనిపిస్తారు.  వీరందరూ తమ గొప్పతనాన్ని తమ పని ద్వారా చూపారు, కాని మాటలతో హటావిడి చేసి కాదు.  మన. గురించి మన పని, మన ప్రవర్తన మాట్లాడలి. ఇటువంటి చి లక్షణాలతో మనం వుండేలా ఆ అంబాపతి అనుగ్రహించాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తూ.......*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు