మణిపూసలు; -విస్లావత్ సావిత్రి 10వ తరగతి,ZPHS నేరెళ్లపల్లి,మహబూబ్నగర్,7013264464

 01.
 సంక్రాంతి పండగొచ్చెను
 సంబరాలే తెచ్చేను
 ప్రతి ఇంటి గడపకు
 హరిదాసులాట వెలిగెను.
02.
 మూడు రోజుల పండుగా
 ముచ్చటలే తీరంగా
 అందరు కలిసి ఇంట్లో
 పిండి వంటలు చేయగా.
03.
 ధనుర్మాస నెల పండుగ
 గంగిరెద్దులు ఆడంగ
 హరిదాసుల పాటలు
 వినసొంపుగాను ఉండగ
04.
పరిసరాలన్ని శుచిగా
ఇంటి ముందు అలకంగా
అందమైన ముగ్గు వేసి
ఇల్లు అలంకరించగా.
05.
 సంక్రాంతి పండుగా
 సంబురాలు నిండగా
 సంతోషంగా అందరు
 జీవనమే గడపగా.
06.
 హరిదాసులందు ఆటలు
 బసవన్న తియ్య పాటలు  
 కమ్మని ఆట పాటలతొ
 అందరికి  ఆనందాలు.
07.
 రంగుల గాలి పతంగం
 అన్నదమ్ముల పతంగం
 నింగిలో తేలుతుంటే
మా మనసులో సోయగం
08.
 ఆట పాటల తోటి
 బంధుమిత్రుల తోటి 
 అందరు కలిసి మనము
 జాతరకెల్దమంటి
09.
 పల్లెల్లో పండుగా
 సంక్రాంతి పండుగా
 పల్లెలన్ని పులకించి
 స్వేచ్ఛగా ఉండగా.
కామెంట్‌లు