"మణిపూసలు";-నేనావత్ మౌనిక10 వ తరగతిZPHS నేరెళ్ల పల్లిమండల్ బాలానగర్జిల్లా మహబూబ్ నగర్703264464
 1.
మనిషికి ఆనందము
మధురమైన జీవితము
నిర్మలంగా బతుకుతూ
స్వచ్ఛంగా ఉండుము.
2.
కల్మషం వీడు దాము
 కోపాల్ని  వదులుదాము
నవ్వుతూనే జీవిస్తూ
హాయిగానె ఉందాము
3.
దయాగుణం చూపాలి
న్యాయంగా ఉండాలి
సత్యమే మాట్లాడుతూ
మంచిని చూపించాలి
4.
నేర్పే నేడు గురువులు
త్యాగమనెడి  పాఠాలు
వారే కదరా వీరులు
వీరే మహానీయులు
5.
గాంధిజీ ని చూడరా
సంస్కారం నేర్వురా
అంబేద్కర్ ని చూడండి
ఎంత గొప్ప వారురా
6
ప్రేమను పంచువారు
జ్ఞానం పంచువారు
వీరే మహనీయుడిగా
చరిత్రకెక్కే వారు
7.
గెలుపును ఆస్వాదించి
ఓటమిని ప్రేమించి
సహజమేనని ముందుండి
అడుగులు సాగించి
8.
కష్టమని వదులుకోరు
ఇష్టమని ఆశపడరు
గొప్పవాడిగా బతికే
మహనీయులంత వీరు
9.
మానవత్వం చూపుము
మనిషిగా బతుకుము
మహానీయుడు గా ఉండి
మంచిని పాటించుము.
10.
విలువలు తెలుసుకొని
జ్ఞానాన్ని పెంచుకొని
దీపమై వెలుగు పోవాలి
మర్యాదగా నడుచుకొని
11.
గోలకొండ చూడరా
జనులందరు చూసెరా
అందరినీ మెప్పించిన
ఎంత మంచి కోటరా

కామెంట్‌లు