అంతర్జాతీయ తెలుగు సంబరాలు 2022;; - నెల్లుట్ల సునీత


 పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెస్ట్ బెర్రీ  ఇంటర్నేషనల్  హైస్కూల్లో 6,7,8 తేదీలలో  ఆంధ్ర సారస్వతి పరిషత్తు అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ గారి అధ్యక్షతన జరిగిన సభలలో
తెలుగు సాహిత్యం నవీన రీతులు సున్ని తాలపై  వక్తగా పాల్గొని  తాను రూపొందించిన నూతన సాహిత్య ప్రక్రియ సున్నితం  పై శ్రీమతి నెల్లుట్ల సునీత  ప్రసగించారు. సున్నితం ప్రక్రియపై సుప్రసిద్ధ సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేశారు, పాఠశాల విద్యార్థులు కళాశాల విద్యార్థుల లో ఉన్న నవ, యువ, వర్తమాన కవులను ప్రోత్సహిస్తూ సాహిత్యంలో తెలుగు భాష విస్తృత పరుస్తున్నారు అని తెలుగు భాష పరిరక్షణ కోసం శ్రీమతి నెల్లుట్ల సునీత చేస్తున్న కృషిని,సేవను, అభినందించారు 
తర్వాత  శ్రీమతి నెల్లుట్ల సునీత
కవి సమ్మేళనంలో పాల్గొని తెలుగు భాష గురించి పద్యాలు ఆలపించారు.   ఘనంగా సన్మానించి ప్రశంస పత్రాన్ని తెలుగు తల్లి జ్ఞాపికను సహస్రావధాని శ్రీ కడిమెళ్ళ వరప్రసాద్ గారి చేతుల మీదుగా
 అందజేశారు.
ఈ సభలలో చైర్మన్ ఏపీ క్షత్రియ కార్పొరేషన్ శ్రీ పాతపాటి సర్రాజు గారు తదితరులు పాల్గొన్నారు.
శ్రీమతి నెల్లుట్ల సునీత సంపాదకత్వంలో వెలువడిన భరతమాత రక్షణ బాధ్యత గ్రంథాన్ని జే .డీ .ఏ లక్ష్మీనారాయణ గారికి అందజేశారు. మరియు పొత్తి నవల ను అందజేశారు.
ఈ సభలో ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీ సరస్వతి దయానంద గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని ప్రసంగించారు.
సాహితీవేత్తలు పండితులు అవధానులు 40 దేశాలనుంచి ప్రముఖులు అంతర్జాతీయ తెలుగు వెలుగు సభలో పాల్గొన్నారు.
శ్రీమతి నెల్లుట్ల సునీతకు నర్రా ప్రవీణ్ రెడ్డి గోపికృష్ణ యామిని, ఉమా భార్గవి, ఐశ్వర్య రెడ్డి ,గీతశ్రీ, ఉమెన్స్ రైటర్స్ అసోసియేషన్ నుంచి మహిళా కవయిత్రులు
సున్నితం  సాహితీవేత్తలు సాహితీ బృందావన విహార వేదిక సాహితీవేత్తలు
సాహితీ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు
కామెంట్‌లు