"ఫ్రెంచివిద్యావేత్త,అంధులఅక్షరశిల్పి లూయిస్ బ్రెయిలీగారి 213 వ జయంతి-ప్రపంచబ్రెయిలీదినోత్సవం-పద్యాంజలి'!!! ;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.

కం.
అంధులకైలిపికనుగొని
అంధులఅక్షరప్రదాతఆద్యుండాయెన్
అంధులసేవలుసలిపియు
అంధులబంధువుగ"లూయి"ఆశలుదీర్చెన్!!!

02.

కం.
అంధులబాధలుబాపుచు
అంధులవిజ్ఞానదాతఅందెనుకీర్తిన్
అంధులలోస్ఫూర్తినిడియు
అంధులలోవెల్గునింపిఆనందించెన్!!!

03.

కం.
అంధత్వాన్నిజయించియు
అంధులలోస్థైర్యధైర్యమాపాదించెన్
అంధులుచదువాలనుచును
అంధులమునివ్రేళ్లలోనఆలిపినుంచెన్!!!కామెంట్‌లు