*శ్రీ శివపురాణ మాహాత్మ్యము - ౨౩ (23)*
 శ్లో: *శ్రోత్రేణ శ్రవణం తస్య వచసా కీర్తనం తథా |*
*మనసా మననం తస్య మహాసాధన ముచ్యతే ||*
*పరమాత్మ, మానవునికి పంచేంద్రియాలు ఇచ్చాడు. చెవులతో సర్వేశ్వరుని లీలను, గుణగణాలను విని, నోరు నొప్పి పుట్టేటట్టుగా ఆ హాలాహలధారుని కీర్తించడము వల్ల, మనస్సు ద్వారా మననము చేస్తూ, చేతులతో ఆ స్వామి పూజ చేస్తూ, కాళ్ళు ఉపయోగించి ఆ దేవదేవుని సన్నిధికి చేరుకోవడం అనేవి విశ్వేశ్వరుని చేరుకోవడానికి మనం చేయవలసిన పనులు అని, ఇవి బ్రహ్మాండమైన, గొప్ప సాధనాలు అని చెప్పబడ్డాయి.*
*శివపదము పొందుట కష్టమే కానీ సాధ్యమే. మనము సాధకులము అవడానికి కూడా ఆ స్వామి అనుగ్రహం వల్ల మనం నిత్యం చేసే క్రియలే మార్గాలు. వేదోక్త కర్మలను అనుసరించి, అనిష్టించి వాటి వల్ల వచ్చే ఫలమును పరాత్పరుని పాదాలచెంత సమర్పించడమే మనము పరమేశ్వర ఫలమును పొందినట్లు. ఇలా చేయడమే మనకు శిసాయుజ్యనికి చేరుస్తుంది.*
*మహేశ్వరుని గూర్చి శ్రవణము, కీర్తనము, మననము చేయవలయును. ఇది శ్రుతి వాక్యము. అందరికీ ప్రమాణము.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు