*శ్రీ శివపురాణ మాహాత్మ్యము - ౨౫ (25)*
 *శివలింగము - పరబ్రహ్మ రూపము*
*శివుడు ఒక్కడే బ్రహ్మ స్వరూపుడు. అందువల్ల, "నిష్కలుడు" లేదా "నిరాకారుడు" అని చెప్పబడుతున్నాడు. శంభుడు "సాకారుడు" కనుక ఆ మహాదేవుని "సకలుడు" అంటారు. పరమశివుడు నిరాకారుడు కనుకనే ఆయనను అరూపమైన లింగరూపంలో పూజించుకుంటాము.  అలాగే, సాకారుడు కనుక ఆ సర్వేశ్వరుని విగ్రహరూపంలో కూడా పూజించుకుంటాము. అంబాపతి, నిరాకారుడు, సాకారుడు అయి సృష్టి మొత్తాన్ని సృష్టి, స్థితి, లయ ల ద్వారా నడిపిస్తన్నాడు. సాకారుడు, నిరాకారుడు కూడా కనుకనే మార్కండేయ రక్షకుని పరబ్రహ్మ రూపంగా కూడా కొలుస్తున్నాము. "శివలింగము సాక్షాత్తు పరబ్రహ్మ కు ప్రతీక".*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు