గుఱ్ఱపు నాడా!౼ సి. నాగభూషణరావు--అరవై ఏళ్లనాటి కథలు - 6 (సేకరణ : డా. దార్ల బుజ్జిబాబు)

  పూర్వం ఒక ఊళ్ళో చెంగయ్య అనే ధనవంతుడైన వర్తకుడుండేవాడు. అతడు చాలా లోభి. ఎవరికీ ఒక్క కానీ ఇవ్వడు. అంత ప్రాణాంతకమని తోస్తే నే తప్ప ఏ ఖర్చూ చేసేవాడు కాడు. సంపా
దించిన ధనమంతా వడ్డీ వ్యాపారాల
లోనూ, నగల వ్యాపారంలోను తిప్పుతూ యుక్తిగా లాభాలు సంపాదిస్తూ ఉంటాడు.
      చెంగయ్యగారి పెరట్లో పశువులతో పాటు ఒక గుఱ్ఱం కూడా ఉండేది. ఏదేనా ఊరు వెళ్లవలసి వస్తే ఆ గుఱ్ఱం మీద వెళ్లేవాడు చెంగయ్య. అంచేత దాన్ని మాత్రం కొంత పుష్టిగానే పెంచుతూ వచ్చేడు.
       ఒకనాడు చెంగయ్య ముప్పయి క్రోసుల దూరంలో ఉన్న సిరిపురమనే ఊరు వెళ్లవలసి వచ్చింది. డబ్బు బాకీ ఉన్న వాళ్లు ఆ నాటికి రమ్మని చెప్పేరు. చెంగయ్య ప్రొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని గుఱ్ఱం మీద బయలు దేరేడు.
       సిరిపురం వెళ్లి అక్కడ పనులు నాలుగూ చక్కబెట్టకుని బయలు దేరబోయేసరికి మధ్యాహ్నం రెండు గంటలు కావచ్చింది. చెంగయ్య ఒక సత్రం దగ్గర ఆగి కాసిన్ని నీళ్లు త్రాగి, అక్కడున్న కుర్రాడితో తన గుఱ్ఱానికి నీళ్లు పట్టించమని చెప్పేడు. వాడు గుఱ్ఱాన్ని తనతో తీసుకు వెళ్లేడు.
       చెంగయ్య వసూలైన డబ్బంతా మరోసారి లెక్క చూచుకొని,  జాగ్రత్తగా అంగీలో దాచుకున్నాడు. అంతలో ఆ కుర్రాడు  గుఱ్ఱానికి నీళ్లుపట్టి తీసుకు వచ్చేడు. చెంగయ్య వాడి చేతిలో ఒక అణ
పడేసి, 'మరి వెళ్లు' అన్నాడు.
          "బాబూ, ఈ గుఱ్ఱం కాలు నాడాకు ఒక మేకు ఊడిపోయింది" అన్నాడు ఆకుర్రాడు., "వేయమంటే ఒక చిటికెలో చేసేస్తాను."
'ఇప్పుడింకో, బేడో, పావలో తెమ్మంటాడు కాబోలును రా బాబూ అనుక్కుని చెంగయ్య "పర్వలేదులే; ఒక్క మేకు పోతే ఏమయింది.” అంటూ గుఱ్ఱంమీది కెక్కి బయలు దేరేడు.
           అలా కొంతదూరం వెళ్లి చెంగయ్య గుఱ్ఱం దిగి. ప్రక్క నున్న చెట్టునీడలో ఒక్క క్షణం  విశ్రాంతి కోసం కూర్చున్నాడు.
అంతలో గుఱ్ఱపు నాడాలు వేసేవాడు. ఒకడు
ఆ త్రోవంట వచ్చేడు. వాడు చెంగయ్య గుఱ్ఱాన్ని చూసి "బాబూ నాళ్లు వేయిస్తారా? అంటూ గుఱ్ఱం కాళ్లు పట్టి డెక్కలు తనిఖీ మొదలెట్టేడు.
           “ఏ నాళ్లూ ఒద్దు, వెళ్లవయ్యా
అన్నాడు చెంగయ్య చిరాగ్గా.
        " ఈ కాలునాడా ఎక్కడో రాలిపోయింది బాబు, బేడ ఇప్పించండి వేసేస్తాను.” అన్నాడు వాడు. బేడ ఖర్చు చెయ్యడం చాంగయ్యకిష్టం లేకపోయింది. “ఒక్క నాడా పోతే ఏం ముంచుకు పోయింది నీదారిని వెళ్లిపో" అన్నాడు. లేచి తిరిగి గుఱ్ఱం మీద బయలుదేరేడు. ఏడెనిమిది మైళ్లు దవుడు తీసేసరికి గుఱ్ఱం కుంటడం మొదలు పెట్టింది. కొంతసేపట్లో  వేగం పూర్తిగా తగ్గిపోయింది.
       అప్పుడప్పుడే చెంగయ్య , ఓ చిట్టడవిలో ప్రవేశించేడు. సూర్యుడు పడమటికొండ వెనుకకు ప్రవేశించేడు. గుఱ్ఱం తిన్నగా నడువలేక పోతున్నాది. చెంగయ్య,
మనసులో దిగులుపట్టుకొంది. గుఱ్ఱంమీంచి డిగేడు; తను ఆ అడవి ఎలా దాటడం ౼ తనదగ్గర అంత పైకముందిగదా, ఎవరైనా దొంగలు మొత్తెతే ఏం చెయ్యాలో తెలీలేదు.  గుఱ్ఱాన్ని మెల్లిగా నడిపించుకు వెళుతున్నాడు
      ఇంతలో చీకట్లు దట్టంగా అల్లుకున్నాయి - రాత్రి సగం పైగా గడిచింది. ఎటుపోవాలో తెలియక చెంగయ్య తికమక పడుతున్నాడు.
      అంతట్లోకి ఎక్కడనుండో ఇద్దరు దొంగలు వచ్చేరు. చంగయ్య మీదపడి కాళ్లూ, చేతులూ విరుగకట్టి డబ్బు మూట పట్టుకుపోయేరు
       చెంగయ్య నిస్సహాయుడై, నాడా వేయించక పోయినందువల్లే కదా? ఈ కీడు మూడిందని అక్కడే అలా పడి ఉన్నాడు.
             ఆ మర్నాడు, తెల్లవారేక సిరిపురంనించి వస్తున్న బాటసారులు చంగయ్యను గుర్తుపట్టి కట్లు విప్పి పరిచర్య చేసేరు.
( ఆంధ్ర - వారపత్రిక,  1- 7 - 1959 )
కామెంట్‌లు