"వేములవాడ శ్రీరాజరాజేశ్వరిమాతస్తుతి-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
                                                      
 సీ.
రావమ్మమాతల్లిరాజరాజేశ్వరీ
శ్రీచక్రసంచారిసిరులదేవి
రావమ్మఓంకారిరావేపరంజ్యోతి
రావమ్మమమ్మేలురాజ్యలక్ష్మి
రావమ్మశాంకరిరావేశుభాంకరి
రావెసద్గుణరాశిరాణివమ్మ
రావమ్మశ్రీంకారిరజితాచలనివాసి
రావెబంగరుతల్లిరమ్యముగను
(తే.గీ.)
పూటపూటకుమాయొక్కనోటిలోన
పాటపాటకుమానోటిపలుకులోన
నిలిచిమహిమలుజూపించినీలవేణి
కరుణతోడనుదీవించుకల్పవల్లి!!!

కామెంట్‌లు