"ముక్కోటిఏకాదశిపండుగ-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
కం.

మక్కువతోశ్రీహరినిల
చక్కగసద్భక్తితోడస్వామినిగొలువన్
ముక్కోటేకాదశియే
మిక్కిలిసంతోషమొసగిమేలునుగూర్చున్!!!

02.
కం.
నారాయణ!నారాయణ
దారినిజూపించికావుదయగలదేవా
నోరారగనీనామము
పారాయణజేసిమిమ్ముప్రార్థింతుమదిన్!!!

03.
కం.
ముక్కోటిదేవతలునీ
చక్కనిదర్శనముజేసిసంతసపడిరే
అక్కజమగుమీరూపము
నిక్కట్లనురూపుమాపునీలోకమునన్!!!

04.
కం.
ఉత్తరద్వారముదర్శన
ముత్తమమార్గమ్ముజూపియుర్విజనులకున్
ఉత్తమఫలితాలనునిడి
ఉత్తమసద్గతులపుణ్యమొసగునుభువిలో!!!

కామెంట్‌లు