"భోగిపండుగ-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
తే.గీ.
దక్షిణాయనతుదిరోజుతరలిరాగ
భగభగమనుచుచలిమంటభాగ్యమిడగ
భోగిపులకరయితులకుభోగమవగ
రేగుపళ్ళలోపిన్నలులీనమవగ
భోగివేడ్కవచ్చిందివైభోగముగను!!!

02.
తే.గీ.
ముద్దుగుమ్మలువేసెడిముగ్గుతోడ
గంగిరెద్దులక్రీడలుఘనముతోడ
గాలిపటములుగాలిలోతేలియాడ
కోడిపందాలుధనమిచ్చికోట్లతోడ
వేగ"భోగియై"నిల్చిందివేడ్కతోడ!!!

03.
తే.గీ.
క్రొత్తఅల్లుల్ల,మరదల్లకొంటెపనులు
కమ్మగాసిద్ధమగువంటకాలరుచులు
క్రొత్తవలువలుధరియించికోరిజనులు
సంబరమ్మొప్పపండుగఅంబరమ్ము
నంటువిధముగాజేతురుఅందరిపుడు!!!
కామెంట్‌లు