"భారతదేశమొట్టమొదటిమహిళాఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రిబాయిపూలే జయంతి-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
కం.
సావిత్రిబాయిపూలే
కోవిదురాలైఘనముగగొప్పగభువిపై
సేవలనెన్నియొజేసెను
పావనముగవిద్యబోధపరమావధిగన్!!!

02.
కం.
భారతదేశపుమణిగా
పోరాటముజేసితానుపొందెనుకీర్తుల్
వీరత్వముజూపించియు
ధీరతతోవిద్యనేర్చిదిక్కులవెల్గెన్!!!

03.
కం.
మహిళల్లోమణిపూసగ
మహిపైవెల్గియుసతంబుమాన్యతనొందెన్
సహనమువీడకచదువును
బహువిధముగనేర్చితానుపరులకునేర్పెన్ !!!

04.
కం.
మహిళలవిద్యావృద్ధికి
సహనముతోసల్పెకృషినిసమ్మతితోడన్
అహమునుజూపకనిజముగ
నిహమందునపుణ్యశీలిహితమునుగోరెన్ !!!

05.
కం.
చదువుకొరకుసావిత్రియె
యెదురునిలిచిపడినదెన్నొయిలలోపాట్లన్
బెదిరింపులకుభయపడక
విధిగతాపనినితానువిలువగజేసెన్!!!

కామెంట్‌లు