"కష్టపడేతత్త్వం-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.

తే.గీ.
కష్టపడిపనిజేసినకడుపునిండు
కష్టపడువాడునెప్పుడునష్టబోడు
కష్టమునుపొందిసుఖమునునిష్టపడుము
"కాయకష్టమేజీవికిక్రాంతినొసగు"!!!

02.

తే.గీ.
కష్టమునకుభయపడడుకార్యశీలి
కష్టపడిననుఫలితమ్ముకడకుదక్కు
కష్టమునునమ్మిపోరాడుకలలుపండు
"కష్టమేమూలధనమనిఖ్యాతికెక్కె!!!

03.

తే.గీ.
పుట్టినట్టిప్రతీప్రాణిపుడమిపైన
రెక్కముక్కలుజేసియురేయిపగలు
కష్టపడియున్నతినిపొందిఘనతగాంచి
ముదముతోడజీవితమునముందుకెళ్ళు!!!

కామెంట్‌లు