"పండుగలు-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
ఆ.వె.
పండుగన్నచాలుపరమానందమౌ
పండుగుండవలెనుప్రతిదినంబు
పండుగున్నరోజువంటలెన్నియొజేసి
కొసరిఅమ్మపెట్టుకోర్కెదీర!!!

02.
ఆ.వె.
పండుగలిలయెన్నొప్రాముఖ్యమైనిల్చి
మనదుసంస్కృతులనుమనకుదెల్పి
సాంప్రదాయములనుచక్కగాశోభిల్లు
నట్లుజేయుచుండునందముగను!!!

03.
ఆ.వె.
పల్లెపట్టణములప్రజలందరునుగూడి
పండుగలనుజేసిపరితపించి
పలకరించుకొనుచు,బాధలుమరచియు
ప్రేమపంచుకొంద్రునేమముగను!!!


కామెంట్‌లు