"ఆనందము-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
కం.
ఆనందంబుగనుండిన
ఆనందంబుగజరుగునుఅన్నిపనులిలన్
ఆనందమ్మేబలమౌ
ఏనాడిదికరువయిననునిక్కటులొచ్చున్!!!

02.
కం.
ఆనందముకానందము
ఆనందముమనిషిలోనఆకృతిదాల్చున్
ఆనందముఆరోగ్యము
ఆనందముతోడరోజునగుపించవలెన్!!!

03.
కం.
ఆనందంబుగబ్రతుకుము
ఆనందంబిచ్చుగాదెఅద్భుతశక్తుల్
ఆనందంబునుపంచుము
ఆనందముతరిగిపోనిఆస్తియెబాలా!!!


కామెంట్‌లు