"మణిపూసలు"; --విస్లావత్ శైలజపదవ తరగతి బాలానగర్ మండలంమహబూబ్ నగర్ జిల్లా7013264464

 1. .
రంగుల పుట్టినిల్లు
మనతెలుగు లోగిల్లు
అందరి ఇండ్ల ముందు
ముగ్గులతొ విలసిల్లు
2.
సంక్రాంతీ పండుగా
సందడిని తెచ్చేగా
రంగు రంగుల ముగ్గుతో
సంబరాలు చేయగా
3.
రకరకాలుగా పిండి
వంటలు చేద్దాం రండి
సంక్రాంతి పండుగలో
మునిగి తేలుదామండి
4.
స్వాగతం పలుకగా
కోళ్ల పందెములుగా
అందరూ పోటీలతో
సందడులు చేయగా
5.
సంక్రాంతి పండుగా
అల్లుండ్లు వచ్చెగా
అందరు ఆనందంతో
సరదాలు చేయగా
6.
చలిలో భోగి మంటలు
పాలు పొంగించడాలు
భోగభాగ్యాలు మనకు
కలిగించే పండుగలు
7.
రంగురంగుల పతంగులు
రమణీయమౌ పతంగులు
అందరికి అందకుండా
ఆకాశంలో గంతులు
8.
సంక్రాంతీ పండుగలు
ఎడ్లబండ్లతొ రేసులు
అందరి మనసులోన
పుట్టె గెలుపు రోషాలు
9.
ఒమిక్రానే వచ్చింది
కల్లోలం రేపింది
బడులన్ని మూసేసి
చోద్యoగా చూస్తోంది
కామెంట్‌లు