కనువిప్పు;-యల్ .నాగేశ్వరి.8వతరగతి…కొత్తపేట…
 ధర్మవరంలో శేఖరయ్య అనే షావుకారు ఉండేవాడు.ఆయనకు పెద్దలనుండి వచ్చిన చాలాభూమి ఉంది.
అతను చాలా పిసినారి.
ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉన్నాడు.
అతనికి రెండుఎకరాల పొలముంది.కరువువల్ల నష్టాల్లో ఉన్నాడు.
పంట పెట్టుబడికి డబ్బు అవసరం ఏర్పడింది.శంకరయ్యను కలిసి అప్పు అడిగాడు.పెట్టుబడికి సాయం చేస్తే పంటరాగానే ఇస్తానన్నాడు.రామయ్య ఎంతగా ప్రాధేయపడినా శంకరయ్య అప్పు ఇవ్వలేదు.
ఒకసారి శంకరయ్యకు విపరీతమైన కడుపు 
నొప్పి వచ్చింది.ప్రాణం పోయేలా ఉంది.ఆ ఊరిలో వైద్య సదుపాయం లేదు.పట్నానికెళ్ళాలి.తన గుర్రం బండిలో
వెళ్దామనుకుంటే గుర్రం అనారోగ్యంతో ముడుచుకుని పడుకునిఉంది.అతన్ని పట్నం తీసుకెళ్ళడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు.ఎందుకంటే పిసినారి శంకరయ్య
ఏ ఒక్కరికీ ఏ సాయం చేయలేదు కదా!
రామయ్యకు విషయం తెలిసింది.మానవత్వం గల రామయ్య వచ్చి
తనఎద్దుల బండిలో శంకరయ్యను పట్నంలోని వైద్యశాలకు తీసుకెళ్ళాడు.నొప్పి తగ్గాక ఇంటీకి చేర్చాడు.
వైద్యశాల అవసరం మనుష్యులఅవసరాన్ని
శంకరయ్య గ్రహించాడు.
గ్రామంలో ఉచితవైద్యశాల నిర్మించాడు.ఆ
గ్రామ ప్రజల అవసరాలకు సహకరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు.

కామెంట్‌లు