సంబరాల స్వర్ణ సంక్రాంతి;-రచన:నాశబోయిన నరసింహ (నాన),చిట్యాల, నల్గొండ, 8555010108
సూర్యుడు మకర రాశిలో సంక్రమణ సమయం 
ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభ శుభ తరుణం 
ముచ్చటయిన మూడు రోజుల మహా పర్వదినం 
తెలుగు పల్లెలందంగా ముస్తాబై అలరారే ఆనందం!

సుందర గొబ్బెమ్మల నడుమ గోదాదేవి గోపికలా
ఇళ్ళ లోగిళ్లు రంగవల్లులతో కళకళ లాడే వైభవం
సూర్యోదయ అస్తమయ ఏక సంభవ సమయం
ఆండాళ్ రంగనాధుని సాంగత్య మొందిన శుభదినం! 

శ్వేత హేమంత శీతల సమీరాలు తరిమేందుకు 
వెచ్చని సెగ

కై భగ భగ మండే భోగి మంటలు
భోగిపళ్లు శ్రీహరి ఆశీస్సులై చిన్నారుల దీవించగ 
పరిపూర్ణానందం అనుభవించే దివ్య భోగి పర్వం! 

ఆడపడుచుల అల్లుళ్ళతో సందడి చేసే గృహాలు 
గగనాన గాలిపటాల పోటీలతో గంతులేసే బాల్యం 
ఎత్తైన మూపురంతో సన్నాయి స్వర రాగాల కతీతమై                                                               
కనువిందుల నృత్యంతో రంకెలేసే డూడూ బసవన్న 
పసిడి రాశులు ఇంటికి చేరగ పరవశించే హాలికులు!

కామెంట్‌లు