గోదామృత గజల్;-సోంపాక సీత--భద్రాచలం 8639311050
నియమాలే మనమనుగడ.. వినరండీ వ్రతులారా..
ముక్తినొసగే మార్గాన్ని.. కనరండీ వ్రతులారా..

జనసేవే హరిసేవగ.. తెలిపితిరే మనపెద్దలు..
తెలివితోడ హంసలాగ.. బతకండీ వ్రతులారా..

పూజలనీ,యాత్రలనీ.. పలుమార్లు భ్రమణాలు..
మీహృదియే ఓకోవెల.. తెలవండీ వ్రతులారా..

ఒడ్డుదాటు సంద్రమేమి.. ఇచ్చుసుమా !లాభములూ..
పనికిరాని పాండిత్యము.. విడవండీ వ్రతులారా..

నిర్మలమనసే నిజభక్తియని.. ఎరిగినావు సిరి'సీత'
మానవతా కుసుమాలై.. విరియండీ వ్రతులారా..

            

కామెంట్‌లు