భవితకు దీపాలు;-డా!!బాలాజీ దీక్షితులు పి.వితిరుపతి8885391722
 తీయనైన నవ్వులు
ముద్దులొలుకు కన్నులు
బూరెలంటి బుగ్గలు
ముద్దొచ్చె మాటలు
ముద్దుగారె చేష్టలు
అలకలు - నడకలు
పలకదిద్దు చిట్టి చిట్టి చేతులవి
చందమామ కావలని
బొమ్మలాట ఆడాలని 
మారంచేసే మహరాజులను
భయపెట్టి తినిపిస్తాం
చక్కిలిగింతలెట్టి నవ్విస్తాం
విసిగిస్తే కసిరెస్తాం
అంతలోనే ప్రేమతో దరిచేర్చుకుంటాం
ఆడుతూ - పాడుతూ
మువ్వల సడిచేయు చిట్టి చిట్టి అడుగులవి
లేలేత పువ్వులవి
రేపటి భవితకు దీపాలవికామెంట్‌లు