"మణిపూసలు";-పాత్లావత్. పురందాస్ 9 వ తరగతిZPHS నేరళ్ళపల్లిబాలానగర్ మండలంమహబూబ్ నగర్ జిల్లా7013264464
 1.
సంక్రాంతి పండుగొచ్చే
సంబరాలు తీసుకొచ్చే
పిండి వంటల తోనా
ఆనందాలు ఇచ్చే
2.
సంక్రాంతి పండుగా
రైతుల కిష్టంగా
పసిడి పంటలు పండి
ధాన్యాలు నిండుగా
3.
పాలు పొంగించేము
ముగ్గులను వేసేము
పాత సాంప్రదాయాలు
మనమెంతో జరిపెము
4.
చిన్నాపెద్దలు చేరి
భోగిమంట వెలిగించిరి
కష్టాలు తీరాలని
దేవున్నీ ఆశించిరి
5.
గంగిరెద్దులు వచ్చును
తన కళను చూపేను
హరిదాసులు వచ్చీ
రామ గీతం పాడెను
6.
ఊరంతా ముగ్గులు
రకరకాల రంగులు
సంక్రాంతి పండుగతో
హరివిల్లుల పల్లెలు

కామెంట్‌లు