|| నూతనమే జీవితమిక ||;-మచ్చరాజమౌళి దుబ్బాక 9059637442
క్షణాలన్నీ దారిపొడవునా 
కన్నీళ్ళను నింపుకుని వెల్తున్నాయి

అలసిపోయిన వెలుతురు 
చీకటి అంచును తాకుతూ 
నిర్వేదంతో, నిశ్శబ్దంగా వెల్తోంది 

విషాదాలు, విస్ఫోటనాలు పురివిప్పిన విషనాగులవుతున్నాయి
బంధుగణాలను తరిమి తరిమికొట్టే 
రాబంధుల నీడలు వెంటేసుకుని
జ్ఞాపకాల శిరసులను నరికేస్తూ వెళ్లి పోతుంది

రంగులమయమైన జీవితచక్రంలో 
ఆశలసౌధంలో విహరించేలా చేసి
క్షణ క్షణం నరకయాతనకు ఊతమౌతూ
రేపుంటుందో లేదో తెలియని అయోమయాన్ని పక్కలోకి చేర్చి /
పకపకమంటూ నవ్వుతూ వెల్తోంది

పొరలు కమ్మిన మనసులకు
ముగింపును వెతుక్కునేలా చేసి
మరణం అంచులను చూపించి మరీ వెళ్లిపోతుంది/
నూతన జీవితంలోకి వెళ్ళుమంటూ
అతికించిన భావాలను 
పూసుకున్న అత్తరుతో సహా కడిగేసుకుని..... కామెంట్‌లు