*మనిషి తత్వం !*;- *రసస్రవంతి & కావ్యసుధ* 9247313488
మానవుడు నిత్య విద్యార్థి
జన్మించింది మొదలు
మరణ ఘడియల వరకు
కొత్త సంగతులను
అన్వేషిస్తూనే వుంటాడు.

మానవుడు తెలివిగల ప్రాణి
అంది వచ్చే అవకాశాలు
సద్వినియోగం చేసుకొని
పరిపుష్టి పొందుతాడు
మానవునికి...
తన తప్పులు తనకు తెలిసి రావు
ఎవరో విమర్శిస్తే తప్ప
తాను తెలుసుకోలేడు.
ఇది మనిషి తత్వం


కామెంట్‌లు