మనిషి జాగ్రత్త;-" కావ్యసుధ " 9247313488

 కరోనా అంటోంది ?
అప్రమత్తంగా ఉంటే- మీ
అంతు చూస్తానంటోంది.
భౌతిక దూరం పాటించకపోతే
భవిష్యత్తు లేకుండా చేస్తానంటోంది
ఎదురు తిరిగి ప్రవర్తిస్తే -- మీ
ఎదలో నిద్రపోతానంటోంది.
విచ్చలవిడిగా తిరిగితే -- నీ
పుచ్చే లేపేస్తా నంటోంది.!
నాపై కన్నెర్ర చేస్తే -- నీ
కట్టే విరగొడతా నంటోంది !
నీవు మనిషిగా ప్రవర్తించకుంటే 
మట్టిలో పాతరేస్తా నంటోంది
ఓ మనిషి  ! జాగ్రత్త అని హెచ్చరిస్తోంది!!
బెదిరి పోకండి! అదిరి పోకండి!!
భయపడకండి!!ధైర్యముతో
అడుగు ముందుకు వేయండి!
ఓ కరోనా నిన్ను అంతం చేస్తామని హెచ్చరించండి!
కరోనాను జయించా లంటే
మాస్కులు ధరించండి!                             
శానిటైజర్లు వాడండి!!
భౌతిక దూరం పాటించండి!!
డాక్టర్లు చెప్పే మంచి మాటలను                     
 వినండి ఆచరించండి !
మహమ్మారిని ఎదుర్కోవడానికి
యుద్ధ వీరులుగా సిద్ధం కండి!
కరోనా నే కాదు, కాలుని కూడా
జైయిద్దాం.
      

కామెంట్‌లు