దత్తపదులు :-మమత ఐలకరీంనగర్9247593432
 
స.ర.స.ము (పాదాంతములో)
తే.గీ
పూస పూసల నెయ్యిన ముంచు దోస
రుచికి రోటిపచ్చడి కోరిరుబ్బ నౌర!
కష్ట మనుకుంటె మిక్సీ ప్రగాఢ వరస
కలదికాలస్యమే లేని సులువుతనము
దత్తపది :-స.ర.స.ము - ( పాదాదిలో )
తే.గీ
సమర భేరిని మ్రోగించి శౌర్య ముగను
రగడ గెలుపొంది సాధించె రాజ్యమంత
సభల నేలిన ఝాన్సీని చదువుమబల 
ముత్యమై నేర్వదగినట్టి సత్యమిదియె
దత్తపది:-స.ర.స.ము (పాదాధ్యంతంలో)
తే.గీ
సకల సద్గుణ దాముని సతుల వరుస
రత్నమెరుపేను సరసన రమణి ధార
సంతలో బెట్టి యమ్మేటి వింతదెలుస
ముదిత యనబోకు దారుణంబుండు కనుము

కామెంట్‌లు