పద్యాలు ; మమత ఐలకరీంనగర్9247593432
 దత్తపది:-ఆశ ,ధ్యాస ,శ్వాస ,కాసు
తే.గి
*ఆశ* పరిహాసమేనని హద్దులేక
పాశమును తెంచు *ధ్యాస* తో పరుగులిడుచు 
బంధ *విశ్వా* సమున్ గూల్చ గంధమయెనె
*కాసు* మీదున్న మోహమ్ము కమ్మి కనులు
తే.గీ
ఆశ నడకనందుత్సాహమద్భు తంబు
ధ్యాస నుంచుమా పడకుండ ధరణియందు
శ్వాస నున్నంత కాలము సమతనెంచ
కాసు తలవంచి వచ్చేను కళలు తీర్చ

కామెంట్‌లు