చిత్రానికి పద్యాలు;-మమత ఐలకరీంనగర్9247593432
 కం.
జక్కన జెక్కిన శిల్పము
మక్కువతో జూడనట్టి మనుజులు గలరే!
తిక్కననైనను ఉలితో
చెక్కుచెదరకుండ మలచె చిత్రమె మనసా

తే.గీ
అమరుడై నిల్చె శిల్పిగా యవనియందు
జక్కనాచార్య చక్కని చుక్కవోలె
తనదు నామంబు జిక్కగన్ గనుల మీద
శిలల యందున భాసిల్లె శిల్పికీర్తి 

కామెంట్‌లు