సమస్యా పూరణలు;-మమత ఐల కరీంనగర్9247593432
 *మంచి మని‌షికి భువిలోన మరణము లేదే*
కం.
పంచిన కూర్మికి వచ్చును
సంచుల కొలదిగనుప్రేమ సంజీవనిగా
ముంచుచు బ్రతికిన చాలనె
*మంచి మనిషికిభువిలోన మరణము లేదే*
కం.
ఎంచిన కార్యము కొరకై
దించెను పర్వత శిఖరము దేదీప్యముగన్
పంచెను ప్రేమను మారుతి
*మంచి మనిషికి భువిలోన మరణము లేదే*

కామెంట్‌లు