మెరుపులు;-మమత ఐలకరీంనగర్9247593432
కారములోదాగివున్న
రసమేగద మమకారం
నిజములోన దాగివున్న
భజన లేనిదే మౌనం

శుభము కోరు దీవెనలు
వరమువంటివే కాద
తరగని చిరు నవ్వులు
ఆభరణాలే కాద


సృజనాత్మకతేదైన
విజయం చేకూర్చదా
రసమధురపు లోచన
చురక వోలె మెరవదా

విశ్వసనీయత పోతె
పగిలిన ముక్కే కదా
పెగ్గెతనం వీడితే
గౌరత వెతుకుతు రాదా

కామెంట్‌లు