శివార్పణమ్;-మమత ఐలకరీంనగర్9247593432
 కం.
వంకలు బెట్టుట గనవే
ఢంకలు మోగించజాల  ఢమరుకనాథా!
లంకను నిర్మించితివట
లంకేశ్వరుడైనదెవరు రావణ బ్రహ్మే!
కం.
బూడిద నుందని నీకడ
పాడిగ జెప్పెదరు యెపుడు పరమేశ్వరుడా!
దాడిని జరిపిన దెవరని
చూడక లంకనుగొనుమని సులువుగనివ్వన్
కం.
పుడమిన భక్తుండడుగగ
కడలిని పాలగను మార్చి కరుణించావే!
నడిగిన వెన్నో యిచ్చిన
జడధారిగ పేరు వచ్చె జంగముడనుచున్

కామెంట్‌లు