లెక్కల మాస్టర్.; -....కనుమ ఎల్లారెడ్డి 93915 23027

 రాజారావు గారు లెక్కల మాస్టర్ గా రిటైర్ ఐనారు. బెండకాయలంటే మహా ప్రీతి.రోజు ఎన్ని కూరలున్న బెండ లేనిదే ముద్ద దిగదు. ప్రతి రోజు బెండ వేపుడు,పులుసు ఎదో ఒకటి ఉండాల్సినదే ." చిన్నప్పటినుండి వాడికి  బెండ ఇష్టం " అని వాళ్ళమ్మ అంటుంటే అందుకే కాబోలు లెక్కలు బాగా వచ్చి లెక్కల మాస్టర్ అయినాడు అనే వాళ్ళు ఇరుగుపొరుగు వాళ్ళు.పిల్లలు లేకపోతే తన పని మనిషినే కూతురుగా భావించి ఔట్ హౌస్
లో భార్య,భర్త ఉండటానికి ఇచ్చాడు.కనకం అయ్యా గారిని తండ్రి గా చూసుకునేది.కాల చక్రంలో  రావు గారి భార్య కాలం చేశారు. అయ్యా గారి బాగోగులు మొత్తం కనకమే చూసేది.కనకం సేవలకు రావు గారు కరిగి పోయేవారు.తన కొడుకును రావు గారి దగ్గరకు ట్యూషన్ కు పంపేది.బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయని ఎవరో చెప్పగా విన్నాడు వాడు.ఒక రోజు మార్కెట్ కు వెళ్ళిన కనకం బెండకాయలు లేకపోతే ఓ చోట ఏరి,కోరి తెచ్చింది.అయ్యా గారికి ఆలస్యం అవుతుందని హడావుడిగా వచ్చింది. ఇంట్లో కనకం కొడుకు  " అమ్మా రావు తాతయ్య వల్ల  నాకు లెక్కల మాస్టర్ గా ఉద్యోగం వచ్చింది" అని చెప్పాడు.కనకం సంతోషంగా రావు గారి దగ్గరకు వెళ్ళి సంచి ప్రక్కన పెట్టేసి "మీ దయ వల్ల ,మీ పోషణ లో నా కొడుక్కు ఉద్యోగం వచ్చింది "అని దండాలు పెట్టింది. " వాడికి కూడా నా మాదిరే బెండ అంటే ఇష్టం . అందుకే లెక్కల మాస్టర్ అయినాడు " అన్నాడు రావు గారు నవ్వుతూ.

కామెంట్‌లు