మంచి బుద్ధి;-..కనుమ ఎల్లారెడ్డి93915 23027


 .గణేష్ స్కూల్ నుంచి వస్తూనే "అమ్మా ఆకలి త్వరగా అన్నం పెట్టు" అన్నాడు. "సరే ముందు  కాళ్ళూ, చేతులు కడుక్కురా అంది జానకమ్మ.గణేష్ కాళ్ళూ, చేతులు కడుగుకొని భోజనానికి కూర్చున్నాడు.ముద్ద నోటిలో పెట్టుకోబోతుండగా "అమ్మా ఆకలి ఇంత ముద్ద ఉంటే పెట్టండమ్మ" అనే మాట వినిపించింది.గణేష్ వెంటనే లేచి చేయి కడిగి తన తట్ట లోనిది తీసుకెళ్లి ఆ బిచ్చగాడికి వేసి వచ్చాడు. "నేను అమ్మా ఆకలి అని అడిగాను,వాడు అలాగే అడిగాడు అందుకని తట్టుకోలేక అన్నం వేసి వచ్చానమ్మ " అన్నాడు."నీ మంచి బుద్ధికి సంతోషం "ఇందా ముద్ద తిను " అంటూ నోట్లో పెట్టింది జానకమ్మ.


కామెంట్‌లు