చిట్టి కథ: స్నేహం; -..కనుమ ఎల్లారెడ్డి93915 23027.

 అనిల్,విక్రమ్ ఇద్దరూ మంచి స్నేహితులు,ఒకే తరగతి,వారి ఇల్లులు కూడా ఎదురెదురుగా ఉండేవి.ఇద్దరూ క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్ళేవారు. అనారోగ్యంతో కానీ,ఇతరత్రా కానీ ఇద్దరిలో ఎవరు స్కూల్ కు హాజరు కాకపోయినా ఆ రోజు జరిగే పాఠాలను ఒకరికొకరు చెప్పుకునేవారు.ఒకరోజు విక్రమ్ కు సుస్తీ చేసి స్కూల్ కు వెళ్ళలేక పోయాడు.ఆ రోజు  సోషల్ టీచర్ పాఠం ముగించి రేపు ఈ పాఠం లోని ప్రశ్నలకు పరీక్ష పెడతాను.అందరూ తప్పక రాయాలి అని చెప్పింది.అనిల్ ,విక్రమ్ ఇంటికి వెళ్ళి ఆ రోజు జరిగిన పాఠం వివరించి రేపు ఈ పాఠం లోనే పరీక్ష ఉంది  రాస్తావు కదూ అన్నాడు. " రాస్తాను " అన్నాడు విక్రమ్.
అనుకున్నట్లుగానే సోషల్ టీచర్ రాగానే పరీక్ష పెట్టింది.అనిల్,విక్రమ్ లకు మంచి మార్కులు వచ్చాయి.సునీల్ ఆబ్సెంట్ కావడంతో టీచర్ మాట్లాడుతూ " విక్రమ్ ఆ రోజు పాఠం వినలేదు.కానీ పరీక్ష రాశాడు.మంచి మార్కులు వచ్చాయి.దీనికి కారణం అనిల్ .
ఆ రోజు పాఠం చెప్పి,పరీక్ష రాసేటట్లు చేశాడు.ఇది స్నేహం అంటే.ఒకరోజు క్లాస్ కు రాకపోయినా ,టీచర్ ఏమి చెప్పిందో తెలుసుకోవాలి.మంచి మిత్రులు మీకు ఉండాలి.ఇంకెప్పుడు పరీక్ష ఎగగొట్టకు, విక్రమ్ ను ఆదర్శంగా తీసుకో అని ,విక్రమ్ ను అభినందించి,మీరందరూ మంచి స్నేహం కలిగి
ఒకరికొకరు సహకరించుకోవాలి" అని చెప్పి వెళ్ళింది.

కామెంట్‌లు