::సరైన దారి;-..కనుమ ఎల్లారెడ్డి93915 23027

 భాస్కర్ జమీందారి బిడ్డ.అల్లరి చిల్లరిగా తిరిగి
వృధాగా డబ్బులు ఖర్చు పెట్టె వాడు.పాఠశాల కు డాబుగా కారు లో వచ్చేవాడు.ఆలస్యం అయినా అతన్ని ఏమి అనే వారు కాదు.ఎందుకంటే ఆ పాఠశాల కు వాళ్ళు స్థలం ఇచ్చారు.అందుకని పాఠశాలలో హెడ్ మాస్టర్ తో సహా ఉపాధ్యాయులు అందరూ అతన్ని ప్రత్యేకంగా చూసే వారు.క్లాస్ కు హజరు కాకా పోయిన హాజరువేసే వారు.పరీక్షల లో ప్రత్యేకంగా గది ఏర్పాటు చేసి పరీక్షలు రాపించే వారు. ఇదంతా క్రాంతి అనే విద్యార్థి కి నచ్చేది కాదు.అదే విషయం ఆ
పాఠశాల లోని నీరజ టీచర్ ను అడిగితే "అదంతే క్రాంతి వాళ్ళు పాఠశాలకు స్థలమే కాక ప్రతి సంవత్సరం డోనేషన్ కూడా ఇస్తున్నారు. మరి ప్రతి  ఏడు  ఉపాధ్యాయ దినోత్సవం రోజున వాళ్ళ నాన్న గారు మమ్ములను ప్రత్యేకంగా గౌరవించి బట్టలు కూడా ఇస్తున్నారు. అందుకే భాస్కర్ పట్ల
ఉదాసీనత గా ఉంటున్నాం.అతన్ని ఎలా నిరోధించేది. ఒక్కొసారి తరగతి గదిలో పాఠాలు వినకుండా నిద్రపోయే సందర్భాలు ఉన్నాయి. మా పర్మిషన్ లేకుండా తరగతి గది నుంచి బైటకు వెళ్లే వాడు.అంతే ఏమి అనక చూస్తూ ఊరుకున్నాం క్రాంతి " అంది
"అయితే భాస్కర్ ను మార్చ లేమా మేడం "
అన్నాడు క్రాంతి.
"మేమందరం చెప్పి చూశాం .వాళ్ళ నాన్నకు చెబితే దారికి వస్తాడేమో నని చెప్పాము. ఆయన  సరే అన్నాడు కాని మళ్ళీ మాములే.మాతో కాలేదు.నీతో ఏమైనా అవుతుందేమో ప్రయత్నం చేయి " అంది నీరజ టీచర్.
"ప్రయత్నం చేస్తాను మేడం "ఆన్నాడుక్రాంతి.
దాదాపు  పదహైదు రోజుల నుంచి భాస్కర్
స్కూల్ కు వెళ్ళలేదు.క్రాంతి విచారిస్తే డెంగీ జ్వరం అని తెలిసింది. ఆ రోజు క్రాంతి భాస్కర్ ఇంటికి బ్రెడ్, పళ్ళు తీసుకు వెళ్ళాడు. క్రాంతిని చూడగానే భాస్కర్ కళ్ళు విశాలమైనాయి.
వాళ్ళ నాన్న చూసి " రా బాబు " అన్నాడు ఆప్యాయంగా.
"ఎలా ఉంది భాస్కర్ "అన్నాడు క్రాంతి.
నీరసం తో ఏ సమాధానం ఇవ్వ లేదు భాస్కర్.
"ఏమి తగ్గ లేదు బాబు.ఈ రోజు నిన్ను చూడగానే ముఖం లో కొంచెం కాంతి వచ్చింది." అన్నాడు.
"భాస్కర్" చిన్నగా పిలిచాడు క్రాంతి. ప్రక్కన కూర్చున్నాడు .క్రాంతి నిచూడగానే ఆనందం కలిగింది. క్రాంతి, భాస్కర్ ను పరిశీలనగా చూశాడు. కళ్ళు పీక్కు పోయి,ముఖం పాలి పోయి ఉంది. భాస్కర్ ముఖం తడుతూ "నీకేమి కాదు భాస్కర్ తొందరలోనే కొలుకుంటావు " అన్నాడు క్రాంతి. ఆ మాట వినగానే క్రాంతి సంతోష పడ్డాడు.
"నా కోసం రోజు వస్తావా క్రాంతి " అన్నాడు.
భాస్కర్ మొదటి సారి మాట్లాడిన మాట అది.
"వస్తాను భాస్కర్"అన్నాడు క్రాంతి.
ఆ రోజు నుంచి రోజూ భాస్కర్ ఇంటికి వెళ్ళి పరామర్శించి,క్లాస్ లో ఏయే ఏయే పాఠాలు చెప్పారో అవన్నీ చెప్పే వాడు .క్రాంతి తో నేస్తం
పూర్తిగా ఫలితం ఇచ్చింది. ఇదివరకు అతని స్నేహితులు ఎవరూ అతన్ని పలకరించ లేదు.
తోటి విద్యార్థి క్రాంతి ,భాస్కర్ ను పకరించటం తో భాస్కర్ లో వస్తున్న మార్పును గమనించాడు భాస్కర్ తండ్రి.
"బాబు నీ సహవాసం వల్ల వాడు మాములు
మనిషి అవుతున్నాడు.నీ మాట తీరు ,ప్రవర్తన ,నీ మేలు మరచిపోలేను. తల్లి లేని బిడ్డ నువ్వు అన్ని విధాలా వాడికి అండగా ఉంటూ మంచి మాటలు చెబుతూ వచ్చావు."అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు భాస్కర్ తండ్రి.
తండ్రి లాంటి వ్యక్తి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే
చూడలేక పోయాడు క్రాంతి. "అంకుల్ మీరు బాధ పడకండి.మీకు భాస్కర్ కొడుకు అయితే, అతను నా ఆప్త మిత్రుడు.మిత్రునకు అస్ మాత్రం సహాయం చేయడం నా విధి " అన్నాడు క్రాంతి.
క్రాంతి సహచర్యం లో భాస్కర్ పూర్తిగా కొలుకున్నాడు.పరీక్షలు దగ్గరకు వచ్చాయి
అన్ని విధాలా భాస్కర్ ను సిద్ధం చేశాడు క్రాంతి.
"నీ మేలు మరువలేనిది క్రాంతి "అన్నాడు భాస్కర్.
"అయితే నాకు ఏమి ఇస్తావు " అన్నాడు
"నువ్వు కోరింది ఏదయినా సరే " అన్నాడు భాస్కర్.
"మాట తప్పవుగా " అన్నాడు.
" తప్పను "అని తల ఆడించాడు భాస్కర్.
"అయితే భాస్కర్ నీ దారి పూర్తిగా మార్చుకోవాలి. రేపు పరీక్షల లో నీ కోసం సిద్ధం చేసిన ప్రత్యేక గది లో కాకుండా,మాతో పాటు నువ్వు కూడా పరీక్షలు రాయాలి.పాఠశాల కు క్రమంగా రావాలి.చేడు అలవాట్లు, వృధాగా డబ్బులు ఖర్చు చేయడం పూర్తిగా మాను కోవాలి.మంచి క్రమశిక్షణ తో ఉండాలి.అందరితో కలివిడిగా ఉండాలి.ఉపాధ్యాయులను గౌరవించాలి. ఇదే నీ దారి.ఇదే నాకు కావాలి ఇస్తావా " అన్నాడు క్రాంతి. ఆ మాటకు భాస్కర్ చలించి పోయాడు.క్రాంతిని గట్టిగా వాటేసుకుని నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను.నీ మాట వింటాను క్రాంతి " అన్నాడు.
ఆ యేడు పరీక్షలు అందరితో కలిసి రాశాడు.భాస్కర్ కు మంచి మార్కులు వచ్చాయి.ఉపాధ్యాయులు అందరూ ఆశ్చర్య పోయారు.ఇదంతా క్రాంతి చలువ అనుకుని
అభినందించారు.
భాస్కర్ ,క్రాంతి దగ్గరకు వెళ్ళి " నన్ను సరైన దారిలో పెట్టిన నీకు కృతఙ్ఞతలు "అని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. మిత్రుడు పూర్తిగా మారిపోయినందుకు సంతోషించాడు క్రాంతి.    
                      ..సమాప్తం..

కామెంట్‌లు