కథ: ఔదార్యం; -..కనుమ ఎల్లారెడ్డి93915 23027.
 వల్లభా పురం సముద్రానికి దగ్గరగా ఉన్న దేశం
చలికాలంలో అక్కడ విపరీతంగా చలి ఉంటుంది.ఎండాకాలం చాలా మంది.ఆ సముద్ర ఇసుక తీరాలకు వెళ్ళి అక్కడ  నిద్రించే వారు.ఆ సముద్రం ఎప్పుడూ ఉప్పొంగదు. ఇంతవరకు ఎటువంటి నష్టం జరగలేదు.గంగమ్మ తల్లి మమ్ములను చల్లగా చూస్తుందని ఆ ప్రజల నమ్మకం.చలి కాలంలో
విపరీతమైన చలితో ప్రజలు గజ గజ వణికి పోతారు.చలి పులికి మరణించిన వారు కూడా ఉన్నారు. అది విపరీతమైన చలి కాలం. ఇంత చలిలో ప్రజలు ఎలా ఉంటారోననే  మీ మాంస
కలిగింది యువరాణి వినీలా దేవికి. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా ఆ రాత్రి పుర వీధులలో చెలికత్తెలతో మారు వేషంలో సంచారం చేస్తోంది.అందరూ ఇళ్ళ కు గడియ పెట్టుకున్నారు.కొంతమంది ఇళ్ళలోకి కిటికీల గుండా చూసింది.ముడుచుకొని చాలి చాలని
దుప్పటి కప్పుకొని నిద్రిస్తున్నారు.ప్రతి ఇళ్ళల్లోనూ అదే పరిస్థితి. అలానే పురవీధులలో చూస్తూ వెళుతోంది.ఒక చోట
ఓ ముదుసలి రెండు చేతులు కాళ్ళ సందులో పెట్టుకుని మూలుగుతూ ,ముడుచుకుని వణుకుతూ చీర కొంగు ముఖానికి చుట్టుకొని
నిద్రిస్తోంది.మరో చోట చెట్టు కింద ఓ కుటుంబం చాలి చాలని దుపట్లతో ముడుచుకుని పడుకున్నారు.చాలా చోట్ల గృహాలలోను, ఆరుబయట చలికి వణికి పోతున్నారు. వాళ్ళను చూడగానే  జాలి వేసింది వినీలాదేవికి. ఇళ్ళు, లేని వారికి, ఇల్లు ఇవ్వాలని,కుటుంబాలకు సరి పడ దుప్పట్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అది తన పుట్టినరోజు నాడే ఇవ్వాలని తండ్రి సూరసేన
మహారాజుకు తెలియజెప్పింది.
" మంచి నిర్ణయం తల్లి.ప్రజల బాగోగులు కనుక్కున్నందుకు సంతోషం. నీ పుట్టిన రోజే ఈ పని మొదలు పెట్టు ఇండ్లు కావలసిన వారికి ఇళ్ళు, మరియ ప్రతి కుటుంబానికి కావలసిన దుప్పట్లు ఇప్పిస్తాను ".అని మంత్రికి కబురు చేశాడు. వెంటనే ఆ విషయం రాజ్యం లో చాటింపు వేయించాడు.మరుసటిరోజు వినీలా దేవి పుట్టిన రోజు సందర్భంగా  ఇళ్ళు లేని వారికి ఇళ్ళు, మరియు దుప్పట్లు పంపిణీ చేసింది వినీలా దేవి.అవి అందుకున్న ప్రజలు
సంతోషంతో " యువరాణి వినీలా దేవికి  జై " అని జేజేలు పలుకుతుంటే ఆ తల్లిదండ్రులు కన్నులలో ఆనందబాష్పాలు రాలాయి.


కామెంట్‌లు