సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com

 సత్యము-
@ మానవాళి అందరికి ఒకే వాస్తు సత్యం.  మనిషి కొక వాస్తు అనటం మూర్ఖమనస్తత్వం.
@ మానవుడు దేవునికి పెట్టిన పేర్లన్నిటిలో మహోత్కృష్టమైనది సత్యం. సాక్షాత్కార ఫలమే సత్యం. దానిని ఆత్మలోనే అన్వేషించు.
@ నువ్వు చెప్పేది సత్యం అయితే గుర్తుంచుకోవాల్సిన అవసరమే ఉండదు . మార్క్ ట్వెయిన్
@ లోభం కన్నా దుర్గుణం, సత్యం కన్నా తపస్సు, మనశ్శుద్ధికన్నా పుణ్యాలు  మరి లేవు.
@ వృద్ధులు లేని సభ సభే కాదు.   ధర్మం చెప్పకపోతే వారు వృద్దులే కారు.
@ సత్యం లేకుండా చెప్పినది ధర్మమే కాదు.   కపటంతో కూడిన సత్యం సత్యమే కాదు. 
@ మనిషి ఆచరించవలసిన ఉత్తమవ్రతాలు.ద్రోహం చేయకుండా ఉండటం, పాత్రత తెలిసి దానాలివ్వడం, సత్యం పలకడం.  మహాభారతం
@ సత్యం అంటే నిజం,  ఎవరూ ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలి. 
@ సత్యం పరిశీలన వల్ల, నిదానం వల్ల శక్తిమంతం అవుతుంది.   కపటం తొందరపాటు వల్ల తనని తానే బయట పెట్టుకుంటుంది . టాసిటస్

కామెంట్‌లు